పుట్టిన రోజున ప్రేరణగా మారిన బుట్ట బొమ్మ

పుట్టిన రోజున ప్రేరణగా మారిన బుట్ట బొమ్మ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే పుట్టిన రోజు(అక్టోబర్‌ 13) సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ఆమె లుక్ రివీల్ చేసింది చిత్రబృందం. యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. వెస్ట్రన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ ధరించిన పూజ తలకు స్కార్ఫ్‌ కూడా కట్టుకుండి. ఒక విదేశి రెస్టారెంట్‌లో ప్రభాస్‌ ఎదురుగా కూర్చున్న పూజా నవ్వులు చిందిస్తూ అందంగా కనిపిస్తోంది. పోస్టర్ మొత్తం ఆకుపచ్చదనం హైలైట్ గా చేయడం చాలా బాగుంది.

పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. ఇక ప్రభాస్‌ 41 వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది.