బుట్టబొమ్మ పూజాహెగ్డే తెలుగు, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుండగా..ఆయన తనయుడు రామ్ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. ఇలా రెండు భాషల్లో చేతినిండా ప్రాజెక్టులు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ముంబైలోని బాంద్రాలో ఓ ఇళ్లును కొనుగోలు చేశారు.
స్కైలైన్ వ్యూ ఉన్న 3బిచ్‌కె అపార్ట్‌మెంట్‌ను ఆమె ఇటీవలె తీసుకున్నట్లు పూజా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇంటీరియర్ డిజైనింగ్‌ను కూడా పూజా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అవకాశాలకు తగ్గట్లుగానే పూజా తన తన రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. దీంతో వరుస అవకాశాలతో చేతినిండా సంపాదిస్తుంది ఈ భామ.