నా కలలను నిర్మించుకుంటున్నాను

సొంత ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. ఆ కలను జీవితంలో తొందరగానే నిజం చేసుకున్నారు హీరోయిన్‌ పూజా హెగ్డే. ముంబైలో ఆమె ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్‌ డిజైన్, కలర్‌ వంటి విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ‘‘నా కలలను నిర్మించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు పూజ.

ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘భాయిజాన్‌’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చిత్రాలు చేస్తున్నారు పూజ. సౌత్‌లో మహేశ్‌ బాబు, ప్రభాస్, పవన్‌ కల్యాణ్, విజయ్‌ చిత్రాలకు ఇచ్చిన కమిట్‌మెంట్‌తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది.