పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వరస హిట్‌లు అందుకటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తెలుగులో చక్రం తిప్పుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆమె నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. లక్కీ హీరోయిన్ అని పేరు తెచ్చుకుని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ కొద్ది రోజులు మాల్దీవుల టూర్‌ను ఎంజాయ్ చేసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ షూటింగ్ పాల్గొన్న ఆమె సెట్స్ ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇందులో ఓ లెజెండరి నటుడు కూడా ఉండటం విశేషం.
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ఆయన కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది పూజ హెగ్డే. ఈ ఫోటో షేర్ చేస్తూ.. ‘లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, షూటింగ్‌లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కల. ఇవాళ నా కలల లిస్ట్‌లో అది టిక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను అమితాబ్ గారితో కలిసి వర్క్ చేశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. చాలా ఎక్కువ చెప్పేశాను. మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి’ అని పోస్ట్ చేసింది. ఆ ఫోటో, ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ బట్టి చూస్తే ఏదో యాడ్ కోసం ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఇది యాడ్ లేదా ఏదైన సినిమా షూటింగ్‌కు సంబంధించా తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే.