కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా ‘బీస్ట్’. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పూజా హెగ్డే మాట్లాడుతూ విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే విజయ్‌తో కలిసి నటించాలనేది నా కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ మూవీలోని అరబిక్ కుతు నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది’ అని పేర్కొంది. అనంతరం పూజా, విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘విజయ్ చాలా కూల్ పర్సన్. ఫ్రెండ్లీగా ఉంటారు. పని పట్ల ఆయన చూపించే అంకితభావం, కష్టపడేతత్త్వం నాలో స్ఫూర్తిని నింపాయి. ఇక నా బర్త్‌డే రోజున విజయ్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
నాకు తెలియకుండా బర్త్‌డే పార్టీకి ప్లాన్ చేశారు. బీస్ట్ మూవీ సెట్లో ప్రత్యేకంగా పార్టీ అరెంజ్ చేశారు. అది చూసి షాక్ అయ్యా. ఒక పెద్ద హీరో అయ్యిండి నా బర్త్‌డే పార్టీని నిర్వహించడం నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. విజయ్ ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. నిజంగా ఆ బర్త్‌డే నాకు చాలా స్పెషల్. ఈ మధురజ్ఞాపకాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ పూజా చెప్పుకొచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులోనూ అదే పేరుతో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు.