సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే అవకాశాలు, అదృష్టంతో పాటు.. లైమ్‌లైట్‌లో ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో సోషల్ మీడియా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో తారలు తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానలుతో షేర్ చేసుకోవడానికి.. వారితో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియానే వేదిక అవుతోంది. అందుకే ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.
అయితే ఇక్కడ కూడా పనికిమాలిని వేషాలు వేసేవారు ఉంటారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఆనందిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో కొందరు సైలెంట్‌గా ఉంటే.. మరి కొందరు తగిన సమాధానం చెప్పి నోరు మూయిస్తారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. దాన్ని ఆమె హ్యాండిల్ చేసిన తీరుకు నెటిజనులు ఫిదా అయ్యారు.
ఆ వివరాలు.. తాజగా పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటో షేర్ చేయమని కోరగా.. ఆయన కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన ఫోటోని షేర్ చేశారు పూజ. ఈ నేపథ్యంలో ఓ అభిమాని నగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేయాల్సిందిగా కోరాడు. దానికి పూజా ఎవర్గ్రీన్ రిప్లై ఇచ్చారు. నగ్న ఫోటో రిక్వెస్ట్‌కి సమాధానంగా పూజ తన పాదాల ఫోటోని షేర్ చేసింది.
వట్టి కాళ్ల ఫోటో చూసి నెటిజన్ కంగు తిన్నాడు. ఇక పూజ స్మార్ట్‌నెస్‌కి నెటిజనులు ఫిదా అయ్యారు. ‘‘టిట్ ఫర్ టాట్’’.. ‘‘దీని బదులు చెప్పు ఫోటో పంపిస్తే బాగుండేది’’.. ‘‘చాలా బాగా సమాధానం చెప్పారు’’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో పని చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు.