సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోందీ పూజా హెగ్డే. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడే చాన్స్ దక్కించుకుంటూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిందీ బ్యూటీ. తాజాగా ఆమె విజయ్ సరసన నటించిన బీస్ట్ ఏప్రిల్ 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అరబిక్ కుతు పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటే కాదు సినిమా కూడా అదే రేంజ్‌లో హిట్టవుతుందని ఎంతో ధీమాగా ఉందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఆమె వెంకటేశ్, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ ఎఫ్3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పూజా హెగ్డే గతంలో రంగస్థలం సినిమాలో ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్‌రాణి..’ అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. మరోసారి ఐటం సాంగ్ ఆఫర్ రాగా అందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం.
అయితే దానికోసం పూజా ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కపాట కోసం మరీ ఆ రేంజ్‌లో డిమాండ్ చేయడమా? అని ఆశ్చర్యపోయిన నిర్మాతలు కోటి రూపాయలు అయితే ఇవ్వగలమంటూ ఆమెకు సర్దిచెప్పి ఒప్పించారట! కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 27న విడుదల కానుంది.