‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్య్వూలో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పూజ చేసిన తడబాటుకు ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన రాధేశ్యామ్ ఈ వెంట్లో పాల్గొన్న పూజ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఆమె సక్సెస్ అనబోయి సె… అంటూ అనుకొకుండ అభ్యంతరకర పదం పలకబోయింది. అయితే వెంటనే దానిని ఆమె సరిదిద్దుకుంది. కానీ ఇది పట్టేసిన నెటిజన్లు పూజను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.
కాగా ప్రభాస్-పూజ హెగ్డేలు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుండగా, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.