మరింత మసాలా అన్నారు… ఇదేమో పప్పులా ఉంది

Pooja ramachandran wild card entry in Bigg Boss season 2

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ ఎన్టీఆర్‌ హోస్టింగ్‌తో ఆసక్తికరంగా సాగి, సూపర్‌ హిట్‌ అయ్యింది. మొదటి సీజన్‌లో ఇంటి సభ్యులు నోటెడ్‌ సెలబ్రెటీలు. కాని రెండవ సీజన్‌కు వచ్చేప్పటికి పరిస్థితి రివర్స్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ స్థానంలో నాని వచ్చాడు, ఇక సెలబ్రెటీలు అంటూ లోనికి వెళ్లిన వారిలో సగానికి పై ఏ ఒక్కరికి తెలియదు. రెండవ సీజన్‌ ప్రారంభం కాకముందు నుండి కూడా ఈసారి ఇంకాస్త మసాలా అంటూ ప్రచారం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. అయితే ఇంకాస్త మసాలా సంగతి పక్కన పెడితే చక్కగా సాగుతుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అయినా మసాలా యాడ్‌ చేస్తారేమో అని అంతా ఆశించారు. వైల్డ్‌ కార్డ్‌తో మంచి సెబ్రెటీలని ఇంట్లోకి పంపించి షోకు గ్లామర్‌ అద్దుతారని భావించారు. కాని అనూహ్యంగా రెండవ వైల్డ్‌ కార్డ్‌ ద్వారా పూజా రామచంద్రన్‌ను పంపించడం జరిగింది.

రెండవ వారంలోనే నందిని రాయ్‌ను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో లోనికి పంపించిన ఇంటి సభ్యులు ఇప్పుడు రెండవ ఎంట్రీగా పూజాను పంపించడం జరిగింది. ఈమె తెలుగులో ‘స్వామిరారా’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో కూడా హీరో నిఖిల్‌కు ఫ్రెండ్‌గా మాత్రమే కనిపించింది. తెలుగులో ఎలాంటి గుర్తింపు లేని పూజాను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో పంపించడం అనేది ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించే విషయం కాదు. ఇక షో ఈసారి అంతా గందరగోళంగా సాగుతుందనిపిస్తుంది. బలమైన కంటెస్టెంట్స్‌ అనుకున్న వారు ఎలిమినేట్‌ అవుతున్నారు. మొదటి మూడు నాలుగు వారాల్లోనే వెళ్తారు అనుకున్న వారు ఇంకా కూడా కొనసాగుతున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అనుకున్న స్థాయిలో మసాలాతో ముందుకు సాగడం లేదు అనేది కొందరి వాదన.