షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న పూజా

షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న పూజా

‘‘రాధే శ్యామ్‌’ షూటింగ్‌లో పాల్గొనడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.‘‘షూటింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు పూజా హెగ్డే.

ఎందుకంటే చిత్రీకరణ ప్రారంభమయ్యాక సెట్లో రెండు పుట్టిన రోజు వేడుకలు ఉండబోతున్నాయట. పూజా బర్త్‌డే అక్టోబర్‌ 10, ప్రభాస్‌ బర్త్‌డే అక్టోబర్‌ 23. ఇలా ఈ ఇద్దరు తమ బర్త్‌డేలను ఈ సినిమా చిత్రీకరణలోనే చేసుకోనున్నారన్నమాట. పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌.