సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ జరగడం ఏంటో.. ఆయన సినిమా రిపబ్లిక్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడం ఏంటో.. ఆ ఈవెంట్‌లో రాజకీయ కామెంట్లు చేయడం ఏంటో గానీ.. వాటికి ప్రతి స్పందనగా వైసీపీ మంత్రులు రియాక్ట్ అవ్వడం వరకు బాగానే ఉంది. ఆ తరువాత పోసానీ కృష్ణమురళీ ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేసేశాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోని ఓ పంజాబీ అమ్మాయి అంటూ పేరు ఎత్తడం, ఆమెకు జరిగిన అన్యాయం, ప్రేమ, పెళ్లి, గర్భం, అబార్షన్ అంటూ కొత్త టాపిక్‌ను లైన్‌లోకి తెచ్చాడు.
అలా మొత్తానికి టాపిక్ అంతా కూడా పూనమ్ కౌర్ చుట్టూ చేరింది. పంజాబీ నటి అంటే అందరూ కూడా పూనమ్ కౌర్ అనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయం గురించి గతంలో ఎన్నో సార్లు చర్చలు జరిగాయి. కత్తి మహేష్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ అంటూ ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. పూనమ్ కౌర్ సైతం ఎన్నో సందర్భాల్లో నర్మగర్భంగా ట్వీట్లు వేస్తూ టాలీవుడ్ టాప్ దర్శకుడు, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తూ వచ్చేది. కొన్ని సందర్భాల్లో అయితే పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకుని వచ్చేది.
గురూజీ అంటూ ఇండస్ట్రీలోని ఓ దర్శకుడిని పూనమ్ దారుణంగా ఏకిపారేసింది.అయితే ఇప్పుడు పూనమ్ కౌర్ వార్తలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. మీరున్నారనే సందేశాన్ని ఆ దేవుడు నాకు ఈ రోజు పంపించినట్టు అనిపిస్తోంది.. ఐ మిస్ యూ.. ఇండస్ట్రీలో ఉన్న ఏకైక గురు దాసరి గారు.. ఐ మిస్ యూ.. తండ్రి సమానులు అంటూ పూనమ్ కౌర్ ఏదో ఒక రహస్యాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.