అక్కడ ‘యానిమల్’ కి పూర్ బుకింగ్స్

అక్కడ ‘యానిమల్’ కి పూర్ బుకింగ్స్
Cinema News

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందున్న హీరోయిన్ గా యువ దర్శకడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఎమోషనల్ యాక్షన్ సినిమా యానిమల్. ఈ సినిమా ని సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, పృథ్వీ రాజ్, బాబీ డియోల్ కూడా నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

అక్కడ ‘యానిమల్’ కి పూర్ బుకింగ్స్
Animal Cinema

నిజానికి మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా చాలా ప్రాంతాల్లో యానిమల్ కి బాగా టికెట్ ప్రీ బుకింగ్స్ జరుగుతుండగా కేరళ లో మాత్రం యానిమల్ కి ఒకింత పూర్ బుకింగ్స్ లభిస్తున్నటు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రధాన మల్టి ప్లెక్స్ లలో తప్ప కొన్ని ఏరియాల్లో బుకింగ్స్ సరిగ్గా లేవని వారు అంటూ ఉన్నారు . రేపు అక్కడ కొన్ని మలయాళ సినిమాల రిలీజ్ లు ఉండడం కూడా దానికి ఒక కారణం అంట . అయితే రేపు యానిమల్ కి హిట్ టాక్ లభిస్తే కేరళలో ఒకింత కలెక్షన్ పెరిగే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతు ఉన్నారు .