Breaking News: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Breaking News: Gas cylinder price increased once again
Breaking News: Gas cylinder price increased once again

మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన ధర, 5రాష్ట్రాల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే పెరగడం గమనార్హం. మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.21 పెరిగినట్లు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్​లో మార్పులకు అనుగుణంగా ఈ మేరకు ధరలు సవరించినట్లు చెప్పాయి. గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించాయి. ఈ వార్తతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వ్యాపారులు మాత్రం గ్యాస్ ధర గుదిబండగా మారుతోందని వాపోతున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్​ సహా ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ బండ ధర ఇప్పటివరకు దిల్లీలో 1,775.50గా ఉండగా.. తాజా పెంపుతో అది రూ.1,796.50కు చేరినట్లు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్-ఏటీఎఫ్​ ధర 4.6శాతం మేర తగ్గినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. ఇప్పటివరకు దిల్లీలో కిలోలీటరుకు 1,11,344.92 రూపాయలుగా ఏటీఎఫ్ ధర ఉండగా తాజాగా 1,06,155.67 రూపాయలకు తగ్గినట్లు వివరించాయి.