Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ తెలుగు కార్టునిస్టు మోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న మోహన్ కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మోహన్ తెలుగులో ఎందరో కార్టునిస్టులకు మార్గదర్శిగా నిలిచారు. సబ్ ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్ గా కూడా గుర్తింపు పొందారు. 1970లో విశాలాంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్ చేరారు మోహన్. తర్వాత ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో పనిచేశారు. సాక్షి ప్రారంభమైన తర్వాత ఆయన కార్టూన్ యానిమేషన్ విభాగంలో సేవలందించారు. మోహన్ కు తెలుగులో పొలిటకల్ కార్టూనిస్ట్ గా ఎనలేని గుర్తింపు ఉంది. వ్యంగ్య చిత్రాలను గీయడంలో ఆయన దిట్ట. ఆయన గీసిన కార్టూన్ లు, బొమ్మలు తెలుగులో విశేష ప్రాచుర్యం పొందాయి. మోహన్ మృతిపై పలు పత్రికా సంపాదకులు సంతాపం వ్యక్తంచేశారు. మోహన్ తెలుగు పత్రికల చరిత్రలో గొప్ప కార్టూనిస్టుల కోవకు చెందిన వారని, పొలిటికల్ కార్టూనిస్టుగా దశాబ్దాల పాటు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వైసీపీ అధినేత జగన్ కొనియాడారు. మోహన్ మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.