పోసాని, ఉండవల్లికి న్యాయం, ధర్మం అప్పుడే గుర్తుకొస్తాయి పాపం.

Posani Krishna Murali And Undavalli Comments On BN Reddy Awards

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తప్పు ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రశ్నించే గొంతు ఉంటే న్యాయం జరిగినా, జరక్కపోయినా ఆ మాటకు విలువ ఉంటుంది. తమకు నచ్చని విషయాలు జరిగినప్పుడు మాత్రమే గొంతు లేపి అలాంటిదే ఇంకోటి జరిగినప్పుడు మౌనంగా ఉంటే ఆ మాటకు విలువ ఉంటుందా ?. ఉండదు. ఇదేమీ ఆలోచించకుండా తమకు నచ్చని విషయాలు జరగనప్పుడు మాత్రమే గొంతు ఎత్తి తమకు తామే గొప్పవాళ్లమని , నిజాయితీపరులమని భీజకీర్తులు వేసుకు తిరిగితే విని,చూసే జనం పిచ్చి వాళ్ళు కాదు. ఈ కోవలో ఉండవల్లి, పోసాని ప్రముఖంగా వస్తారు.

chandrababu and jagan

వీరి కంటికి చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులే కనిపిస్తాయి. జగన్ అవినీతి గురించి ప్రశ్నిస్తే అవినీతిపరుడు కాని నాయకుడు ఎవరు అని పోసాని గారు తెలివిగా జవాబు ఇస్తారు. ఇక ఆ కేసులు నిలబడని వుండవల్లిగారు తేల్చిపారేస్తారు. వాళ్ళు చెప్పేది నిజమే అయినప్పుడు ఒకవైపు తప్పులను మాత్రమే ప్రశ్నిస్తే అర్ధం ఉంటుందా ? పైగా తామేదో మహానుభావులం అన్నట్టు స్వీయ కితాబులు ఇచ్చుకుంటే అబద్ధం నిజం అయిపోతుందా ?

muthyala-subbaiah-boyapati-

సీఎం గా రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు నందుల ఎంపికలో ఏ తప్పులు జరగలేదా ? అప్పుడు ఈ నోళ్లు ఎందుకు మూసుకు కూర్చున్నాయి. మేధావులుగా చెప్పుకునే ఇలాంటి వాళ్ళ మౌనం, చైతన్యం కన్నా వాళ్ళ పక్షపాతమే సమాజానికి పెద్ద చేటు. ఇప్పుడు తనకి నచ్చని బోయపాటికి బి.ఎన్ రెడ్డి అవార్డు రావడం పోసాని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజమే ఆయన చెప్పినట్టు బోయపాటి కన్నా ఆయన గురువు ముత్యాల సుబ్బయ్య ఆ పురస్కారానికి అర్హుడే. కానీ ఈ విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా పోసాని పోరాటం చేశాడా ? నిజం ఏమిటంటే సుబ్బయ్య కు అవార్డు రావడం కన్నా బోయపాటికి రావడం అన్నది పోసానికి పెద్ద విషయం. కాకుంటే దాన్ని డైరెక్ట్ గా చెప్పలేక సుబ్బయ్య గారి పేరు వాడుకున్నాడు. నిజంగా సుబ్బయ్య మీద అంత ప్రేమ ఉంటే నంది పురస్కారాలకు ముందే ఏదో రూపంలో సుబ్బయ్య పేరు ప్రస్తావించి వుండేవాళ్ళు.

Posani-Krishna-Murali

ఇప్పుడు అవార్డులు వచినవాళ్లంతా గొప్ప వాళ్ళని, రాని వాళ్లంతా తక్కువ వాళ్ళు కాదు. అవార్డుల ఎంపికలో తప్పొప్పులు, పక్షపాతాలు గురించి తవ్వుకుంటూ పోతే దుర్గంధం భరించలేం. ఈ విషయం ఇప్పుడు గడ్డపారలు, చెలగపారలతో తవ్వుతున్నవాళ్లకు కూడా బాగా తెలుసు. ఎప్పటికప్పుడు కంపు లేస్తుందన్న భయంతో ఎవరికి వారు మౌనం వహించారు. ఇప్పుడు మాత్రం పోసాని లాంటి కొందరు ఉక్రోషం ఆపుకోలేకపోయారు. దీని వల్ల కంపు లేస్తుంది తప్ప ఇంకేమీ కాదు. ఇప్పుడు పోసాని చెప్పినట్టే నందులు రద్దు చేసి పోసాని అధ్యక్షతన జ్యూరీ వేసి మళ్ళీ ఇచ్చారు అనుకుందాం. అప్పుడు ఒక్క విమర్శ కూడా రాకుండా పోసాని గారంటీ ఇస్తారా? . అంతెందుకు వచ్చే ఏడాది నందులు ప్రకటిస్తే అందులో తప్పుల గురించి పోసాని ప్రశ్నిస్తారో లేదో కూడా తెలియదు. ఏదేమైనా తమ మనసుకు నచ్చనప్పుడు మాత్రమే ధర్మం , న్యాయం గొడుగులు వేసుకుని యుద్ధం చేస్తామంటే వెంటపడి రావడానికి జనం గొర్రెలు కాదు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నోసార్లు జనం నిరూపించారు కూడా. అయినా భ్రమల్లో బతుకుతున్న ఈ మేధావులకే ఈ విషయం అర్ధం కావడం లేదు.