బాబు, పవన్ మీద జగన్ జాలి.

jagan statement on chandrababu and pawan kalyan over jagan padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముందుకు వెళ్లే కొద్దీ కొత్త కొత్త వాగ్ధానాలు మాత్రమే కాదు. సరికొత్త భ్రమలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ పాదయాత్ర లో వచ్చే ఎన్నికల్లో 137 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామంటూ జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ మీద ఇప్పుడు చర్చ మొదలైంది. ఆయన నమ్మకం నిజం అవుతుందో లేదో తర్వాత సంగతి గానీ నంద్యాల,కాకినాడ గాయం ఇంకా పచ్చిగా ఉండగానే ఆ స్థాయి ప్రకటన చేసిన జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ స్టేట్ మెంట్ తో వైసీపీ శ్రేణుల్లో విశ్వాసం పెంచుదామని జగన్ అనుకోవచ్చు. కానీ నిజానికి జగన్ స్టేట్ మెంట్ ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులు. పార్టీ పరిస్థితి మెరుగుపడే చర్యలు తీసుకోకుండా ఇలాంటి ప్రకటనలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదని వారికి తెలుస్తోంది.

ఇక జగన్ చెప్పిన విషయంలో ఔచిత్యం ఎంత వుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. జగన్ హవా బలంగా వీచిన 2014 ఎన్నికల్లో ఆయన గెలిచింది 67 స్థానాలు. ఆ తర్వాత జగన్ బలం రాజకీయంగా తగ్గుతూ వస్తోంది తప్ప ఎక్కడా పెరగలేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేనతో వచ్చే ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు. ఆ పోటీలో వైసీపీ 137 స్థానాల్లో గెలిస్తే ఇక మిగిలేది 38 స్థానాలు మాత్రమే. ఆ 38 ని చంద్రబాబు, పవన్ పంచుకోవాలి అన్న మాట. ఇది భ్రమో ఇంకోటో అనుకున్నా ఇద్దరికీ కలిపి 38 స్థానాలు ఇచ్చి జగన్ బాగానే జాలి చూపాడు.