వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోసానిని ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈరోజు గుంటూరు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.