తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 2012 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70,958కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1139 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

కాగా గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 576కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 532,మేడ్చల్‌లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్‌ అర్బన్‌లో 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు 5,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.