పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎమ్ఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమా పీఎస్పీకే 27 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ రోజు(ఫిబ్రవరి 22) తిరిగి ప్రారంభమైంది. 17వ శతాబ్దపు కాలంనాటి పరిస్థితులకు సరిపోయేలా హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు. ఈ సెట్లో పవన్‌పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో #PSKP27 అనే హ్యష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా లాక్డౌన్ ముందు గతేడాది మార్చిలో 15 రోజులపాటు షూటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే సందర్భంగా సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్.. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటూ పవన్‌కల్యాణ్ బిజీగా ఉన్నాడు.