సైరా కోసం పవన్ సాయం…?

Power star voice-over for Saira

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు గ‌త కొద్ది రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 20 వ తేదీన టీజర్ విడుదల చేయనున్నారు.

ఈ వీడియోపై అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తో సైరా మేకింగ్ వీడియో ఉంటుంద‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

అదేంటంటే అజ్ఞాత‌వాసి సినిమాతో సినిమాల‌కి పూర్తిగా దూర‌మై రాజకీయాలు చేస్తున్న ప‌వ‌న్ ఈ సినిమా కోసం తన గొంతు అరువిచ్చాడట. అయితే ఈ సినిమా టీజర్ మొదటిలో వచ్చే వాయిస్ ఓవ‌ర్‌ పవం ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించగా అక్టోబ‌ర్ 2న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేశారు మూవీ మేక‌ర్స్.

ఇక ఈ సినిమా టీజర్ రేపు రిలీజ్ కానుందని ప్రచారం జరిగినా దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ లేదు, సైమా అవార్డ్స్ కోసం చిరంజీవి దుబాయ్ వెళ్ళిన నేపధ్యంలో అక్కడ ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళాలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.