మరో వారం రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. అక్టోబర్ 23వ తేదీన ఆయన జన్మదిన వేడుక జరుగనుంది. దీంతో ఆయన బర్త్ డే కానుకగా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ని హుషారెత్తించే అప్‌డేట్ ఇచ్చింది ‘రాధే శ్యామ్’ చిత్రయూనిట్. ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ మెసేజ్ పోస్ట్ చేసిన చిత్రయూనిట్.. ”వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం” అని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ చేసిన ఈ ప్రకటన చూసి ప్రభాస్ ఫ్యాన్స్ వెల్‌కం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న క్రమంలో ఆ రెండు సినిమాల నుంచి కూడా ఎలాంటి సర్‌ప్రైజ్‌లు రానున్నాయనే దానిపై ఆసక్తిగా ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ ‘రాధేశ్యామ్’ మూవీ రూపొందుతోంది. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన పూజా హెగ్డే ఆడిపాడుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ నిలిపివేసిన యూనిట్.. ప్రస్తుతం ఇటలీలో మిగిలిన భాగం షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.