పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజా సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీ సినిమా గా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే, ఈ మూవీ కు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది.
‘ది రాజా సాబ్’ సినిమా కి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక నాలుగు సాంగ్స్‌ని పూర్తి చేశాడని.. వీటిని అద్భుతమైన థీమ్స్‌తో డిజైన్ చేయబోతున్నారని.. ఇందులో మెలోడీ సాంగ్స్‌తో పాటు ఒక మాస్ నెంబర్ కూడా ఉందని అన్నారు . ఈ పాటలకి సంబంధించిన షూటింగ్‌ని త్వరలో ప్రారంభించి ఫిబ్రవరి చివరినాటికి పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట .
ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్‌లో ఉన్నారు . ఆయన తిరిగి రాగానే ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవుతాడని.. మార్చి మొదటి వారం నాటికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు ప్రభాస్ పూర్తి చేస్తాడని.. ఆ తర్వాతే తన నెక్స్ట్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘ది రాజా సాబ్’ నుంచి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఏంటో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ మూవీ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.