బాహుబలి సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ప్రభాస్.పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అదే స్పీడ్ లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.కాని యంగ్ డైరెక్టర్స్ వరుసగా అవకాశాలు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.వారు ఫెయిల్యూర్స్ ఇస్తున్నా సరే,యంగ్ టాలెంట్ ను మాత్రం ప్రభాస్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ ఏరికోరి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ కు సాహో తీసే అవకాశం ఇచ్చాడు.సీన్ కట్ చేస్తే ఈ సినిమా బాలీవుడ్ లో తప్పితే ఎక్కడ విజయం సాధించలేకపోయింది.జిల్ తీసిన రాధాకృష్ణకు పిలిచి రాధేశ్యామ్ తెరకెక్కించాల్సిందిగా కోరాడు ప్రభాస్.సాహో కంటే పెద్ద బడ్జెట్‌తో అంతకంటే ఎక్కువ రోజుల షూటింగ్ తో తెరకెక్కింది రాధేశ్యామ్.భారీ అంచనాల మద్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.
సాహో, రాధేశ్యామ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా ప్రభాస్ ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మారుతి. కెరీర్ లో చాలా వరకు యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు. బాబు బంగారంతో వెంకీని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ లాక్ చేసుకున్నాడు మారుతి. సాహోతో సుజిత్ అందిచలేకపోయిన సక్సెస్ ను, రాధేశ్యామ్ తో రాధాకృష్ణ అందిచలేకపోయిన విజయాన్ని ప్రభాస్ కు తాను అందిస్తాను అంటున్నాడు మారుతి.యంగ్ రెబల్ స్టార్ కోసం పవర్ స్టోరీ రెడీ చేశాడట. ముగ్గురు హీరోయిన్స్ కు స్కోప్ ఉన్న ఈ స్టోరీలో అనుష్కకు కూడా ఒక హీరోయిన్ గా కనిపించనుందట. మిర్చి, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్, అనుష్క జోడి మారుతి మూవీలో మరో మారు కనిపించబోతున్నారనే వార్త టీటౌన్ ను షేక్ చేస్తోంది.