ప్రభాస్‌ పెళ్లి అప్‌డేట్స్‌

Prabhas Is Married In 2018 year

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘బాహుబలి’ మొదలు కాకముందు నుండే ప్రభాస్‌ పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రం పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని స్వయంగా కృష్ణంరాజు ప్రకటించారు. అంతకు ముందు ప్రభాస్‌ వివాహం గురించి ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చాయి. భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ రాజుగారి మనవరాలితో ప్రభాస్‌ వివాహం అంటూ పలు రకాలుగా వార్తలు వచ్చాయి. అవన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. ఇక ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా ‘సాహో’ చిత్రంతో బిజీ అయ్యాడు.

‘బాహుబలి’ తర్వాత పెళ్లి అన్న ప్రభాస్‌ ఎందుకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు అనే విషయం తెలియడం లేదు. సాహో సినిమా చాలా కాలం క్రితం చేయాల్సిన సినిమా కనుక ఆ సినిమాను చేసి పెళ్లి చేసుకుంటాడని కొందరు అంటున్నారు. ఇక సాహో సినిమా పూర్తి కాకుండానే ఒక అమ్మాయిని ఫైనల్‌ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఇద్దరు అమ్మాయిలను ప్రభాస్‌ పెళ్లి చూపులు చూశాడు అనేది సినీ వర్గాల్లో జరుగుతున్న టాక్‌. ఆ ఇద్దరు ఎవరు అనే విషయం తెలియదు కాని, ఆ ఇద్దరిలో ఒకరు మాత్రం ప్రభాస్‌కు ఫైనల్‌గా భార్య కాబోతుంది అనేది సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 2018 వేసవిలో ప్రభాస్‌ వివాహం చేసుకుంటాడు అనేది కుటుంబ సభ్యుల మాట.

 మరిన్ని వార్తలు :

ఎన్టీఆర్‌, పూరిలు ఎలా కాంప్రమైజ్‌ అయ్యారో తెలుసా?

ఆడ నిర్మాతలు బెడ్ రూమ్ కి రమ్మంటున్నారు.