16 ఏళ్ల తర్వాత జంటగా ప్రభాస్-నయనతార……

పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్-నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారట. 2007లో యోగి సినిమాలో జంటగా నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనువిందు చేయబోతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు కలిసి నటించనున్న ఆ సినిమా ఏంటో తెలుసా..? ఓ హీరో తీస్తున్న సినిమాలో అతిథి పాత్రల్లో ఈ ఇద్దరూ కలిసి మెరవబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూద్దామా..?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​ ‘కన్నప్ప’ రీసెంట్​గా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో ప్రభాస్​ అతిథి పాత్రలో మెరవనున్నారని, అది కూడా శివుడి పాత్రలో కనిపించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్​తో దీన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఇదే మూవీలో ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించబోతుందట.

16 ఏళ్ల తర్వాత జంటగా ప్రభాస్-నయనతార...... - Telugu Bullet

ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా పార్వతిగా నయన్ కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్-నయనతార​.. యోగీ సినిమా తర్వాత అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది. ఇక కన్నప్ప చిత్రాన్ని మోహన్‌బాబు, విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు.