సొంత బ్యానర్‌లో డార్లింగ్

సొంత బ్యానర్‌లో డార్లింగ్

కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రభాస్ హీరోగా సినిమా రానుంది. యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణం రాజు సొంత బ్యానర్‌లో రాబోతున్న త్రిభాషా చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా ప్రభాస్ సరసన నటిస్తోంది. ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని మరో భారీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రానున్నఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించ బోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్ హీరోగా గోపి కృష్ణా మూవీస్లో వస్తున్న రెండవ చిత్రం కాబట్టి అంచనాలు ఎక్కువే ఉన్నాయి.సంగీతంను బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందిస్తున్నారు. సాంకేతికంగా నాణ్యతతో ప్రభాస్ క్రేజ్ కి అంచనాలు తగ్గకుండా సినిమాను నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మింస్తున్నారు.