భాగ‌మ‌తిని తెగ పొగుడుతున్న బాహుబ‌లి

prabhas praises on anushka over bhagmati teaser release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్కకూ త‌న‌కూ మ‌ధ్య ఏమీ లేదంటూనే… స్వీటీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నాడు ప్ర‌భాస్. అనుష్క టైటిల్ రోల్ లో న‌టించిన భాగ‌మ‌తి టీజ‌ర్ రిలీజ్ అయిన సంద‌ర్భంగా బాహుబ‌లి త‌న హీరోయిన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. భాగ‌మ‌తి టీజ‌ర్ ను ఫేస్ బుక్ లో షేర్ చేసిన ప్ర‌భాస్ అనుష్క క‌థ‌ల ఎంపిక‌ను మెచ్చుకున్నాడు. విభిన్న‌మైన చిత్రాల‌తో..కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌డంలో అనుష్క ఎప్పుడూ ముందుంటుంద‌ని కొనియాడాడు. త‌న ప్ర‌తి సినిమాకు కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌డంలో ఆమె తొలివ‌రుస‌లో ఉంటారు. స్వీటీ, యూవీక్రియేష‌న్స్ మొత్తం టీంకు అభినంద‌న‌లు. భాగ‌మ‌తి టీజ‌ర్ ఇదిగో అని ప్ర‌భాస్ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.

anushka-shetty-bhagmati--mo

బాహుబ‌లి త‌ర్వాతి సినిమాగా అనుష్క న‌టించిన భాగ‌మ‌తిని యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్ నిర్మించారు. ప్ర‌భాస్ సాహో సినిమా నిర్మిస్తోంది కూడా వీరే. సాహోలో మొద‌ట క‌థానాయిక‌గా అనుష్క‌నే అనుకున్నారు కానీ చివ‌ర‌కు బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ ను ఎంచుకున్నారు. ప్ర‌భాస్, అనుష్క హీరోహీరోయిన్ల‌గా నాలుగు సినిమాల్లో క‌లిసి న‌టించారు. బిల్లా, మిర్చి, బాహుబ‌లి ది బిగినింగ్, బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ చిత్రాల్లో న‌టించారు.

anushka-shetty-and-prabhash

బిల్లా సినిమా నుంచి వారి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. మిర్చి సినిమా త‌ర్వాత వారిపై గాసిప్స్ వ‌చ్చాయి. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లిచేసుకుంటార‌ని వార్త‌లొచ్చాయి. అయితే బాహుబ‌లి సినిమా షూటింగ్ తో ఆ పుకార్లు కొంత‌కాలం ఆగినా… సినిమా విడుద‌ల త‌ర్వాత పెళ్లివార్త‌లు ఊపందుకున్నాయి. ఒక ద‌శ‌లో త్వ‌ర‌లోనే వారి పెళ్లి అన్న ఊహాగానాలూ వినిపించాయి. కానీ ప్ర‌భాస్ ప్ర‌తినిధి ఆ వార్త‌లు ఖండించ‌డంతో తాత్కాలికంగా ఈ పుకార్ల‌కు తెర‌ప‌డింది. త‌మ మ‌ధ్య ఏమీలేదంటూనే బాహుబ‌లి, భాగ‌మ‌తిలిద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం, బ‌ర్త్ డేల‌కు ఖ‌రీదైన గిఫ్ట్ లు ఇచ్చుకోవ‌డం చూస్తే.. వారి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనిపిస్తోంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.