Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక సినిమాను నిర్మించాలి అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటీనటుల పారితోషికంతో పాటు, లొకేషన్స్ మరియు సెట్టింగ్స్‌కు చిత్రం కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నటీనటుల హోటల్ ఖర్చులు మరియు రవాణ ఖర్చులు సాదారణంగా ఒక సినిమాకు కోటి వరకు ఉంటుంది. వీటిని సినిమాకు చిల్లర ఖర్చు అని చెబుతూ ఉంటారు. అయితే ‘సాహో’ చిత్రానికి ఈ చిల్లర ఖర్చు ఏకంగా 20 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. దుబాయిలో భారీ షెడ్యూల్ కోసం వెళ్లిన చిత్ర యూనిట్‌కు అక్కడ హోటల్ మరియు ఇతరత్ర అవసరాల కోసం భారీగా ఖర్చు అవుతుందట. దుబాయి షెడ్యూల్ ఇంకా పూర్తి కాకుండానే 15 కోట్ల వరకు ఖర్చు చేశారు. రంజాన్ మాసం పూర్తి అయిన తర్వాత మళ్లీ దుబాయికి సాహో టీం వెళ్లాల్సి ఉంది. అప్పుడు మరింతగా ఖర్చు అవుతుందని అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అంత బడ్జెట్‌కు చిల్లర బడ్జెట్ ఈమాత్రం లేకుంటే ఎలా అనుకున్నారో ఏమో కాని ఏకంగా ట్రావెల్ మరియు హోటల్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమాకు చిల్లర ఖర్చు ఇంతగా అవ్వడం ఇదే ప్రథమం. కోటి లేదా రెండు కోట్లు అంతకు మించి ఇప్పటి వరకు మించలేదు. మొదటి సారి ప్రభాస్ కోసం సాహో నిర్మాతలు ఆ మార్క్‌ను పూర్తిగా చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో ఇంత భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇంత భారీ ఖర్చు మొదటికే మోసం తెచ్చి పెడుతుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.