సాహో బ్రిటిష్ కాలం నాటి క‌థ?

Prabhas sahoo movie story

Posted October 12, 2017 at 19:30

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సాహో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కుతున్న ఈ సినిమాను త‌మిళంలోనూ విడుద‌ల‌చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం సాహో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్త‌యింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జ‌రిగింది. రెండో షెడ్యూల్ కు రెడీ అవుతున్న సాహోపై ఫిలింన‌గ‌ర్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా క‌థ పున‌ర్జ‌న్మ నేప‌థ్యంలో సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

బ్రిటిష్ వారి ప‌రిపాల‌నా కాలంలోనూ, స్వ‌తంత్రం వ‌చ్చాకా… ఇలా రెండు వేర్వేరు కాలాల‌కు సంబంధించిన క‌థ అని తెలుస్తోంది. బ్రిటిష్ కాలంనాటికి త‌గ్గ‌ట్టుగా స‌న్నివేశాలు తీయాల్సి రావ‌డం వ‌ల్లే సినిమాకు భారీ బ‌డ్జెట్ కావాల్సివ‌చ్చింద‌ని భావిస్తున్నారు. బాహుబ‌లిలో రాజుల కాలం నాటి క‌థ‌లో న‌టించిన ప్ర‌భాస్ సాహోలో స్వ‌తంత్ర కాలం నాటి క‌థ‌లో న‌టిస్తున్నార‌న్న‌మాట‌. సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధ హీరోయిన్ గా న‌టిస్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన ప‌లువురు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

SHARE