డెబ్భై కోట్లు తీసుకుంటున్న ప్రభాస్

డెబ్భై కోట్లు తీసుకుంటున్న ప్రభాస్

ప్రభాస్ తో వైజయంతి మూవీస్ తీసే నాగ్ అశ్విన్ సినిమాకి డెబ్భై కోట్ల పారితోషికం అంటూ మీడియాలో తెగ బుగ్గలు నొక్కేసుకుంటున్నారు. అయితే అచ్చంగా తెలుగు మార్కెట్ మాత్రమే ఉన్న హీరోలకి నలభై, యాభై కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదిప్పుడు. అలాంటిది ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉండి, తెలుగు రాష్ట్రాల బయట కూడా వంద కోట్లకి పైగా బిజినెస్ చేయగల సత్తా ఉన్న ప్రభాస్ కి డెబ్భై కోట్లు ఇవ్వడం చాలా రీజనబుల్ అనుకోవాలి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడమే కాకుండా అన్ని వైపుల నుంచి రాబడి తెచ్చే హీరో అతనొక్కడే. అందుకే ఈ చిత్రానికి గాను ఏడాది డేట్స్ ఇచ్చిన ప్రభాస్ డెబ్భై కోట్లు తీసుకుంటాడట. అలాగే సినిమా లేట్ అయితే దానికి కూడా అదనంగా ఛార్జ్ చేస్తాడట. ఇక సినిమాకి ఇరవై కోట్లకి పైగా లాభం వస్తే అక్కడి నుంచి ప్రభాస్ కి కూడా నలభై శాతానికి పైగా వాటా ఇవ్వాలట. బాహుబలి క్రేజ్ ని ప్రభాస్ భలేగా వాడుకుంటున్నాడు కదూ.