ప్రభాస్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

ప్రభాస్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

టాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ ప్రభాస్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస పాన్​ ఇండియా చిత్రాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు డార్లింగ్​. బాహుబలి మూవీతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగిన ప్రభాస్​ అభిమానులకు సినిమాలతో విందు భోజనం వడ్డించనున్నాడు. సినిమాలతోనే కాకుండా తనతో షూటింగ్​లో పాల్గొనే కోస్టార్స్​కు సైతం విందు భోజనం ప్రేమగా వడ్డిస్తాడు ఈ బుజ్జిగాడు. ప్రభాస్​ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్​కు కూడా ఇంటిరుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్​కు విందు భోజనం వడ్డించాడు. ఇప్పుడు మరో బిగ్​ స్టార్​కు ప్రభాస్​ ఆతిథ్యం అందించాడు.

ప్రస్తుతం ప్రభాస్​ ‘మహానటి’ డైరెక్టర్​ నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్​ కె’ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్​బీకి ప్రభాస్​ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్​ వేదికగా అమితాబ్​ బచ్చన్​ తెలిపారు. ‘టీ4198-బాహుబలి ప్రభాస్​. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్​ మాత్రం జీర్ణించుకోలేను.’ అని ట్వీట్​ చేశారు అమితాబ్​.