ప్రభాస్‌ పెళ్లి జరిగేది అప్పుడేనట

ప్రభాస్‌ పెళ్లి జరిగేది అప్పుడేనట

పాన్‌ ఇండియా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్. ఈ మిర్చి హీరో వరుస పెట్టి పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తూ అభిమానులను తెగ అలరిస్తున్నాడు. డార్లింగ్‌ చేస్తున్న ఈ సినిమాలన్నింటి బడ్జెట్‌ మొత్తం కలిపితే సుమారు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంతటి స్టార్‌ రేంజ్‌ ఉన్న ప్రభాస్‌ ఇంకా టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లలో ఒకరిగా మిగిలిపోయాడు. ఈ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ పెళ్లి గురించి వచ్చే పుకార్లు, విశేషాలు తరచుగా వార్తల్లో ప్రధానాంశాలుగా ట్రెండ్‌ అవుతాయి.

అంతే కాకుండా ఈ బుజ్జిగాడి పెళ్లి కోసం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో చెప్పినట్లు స్వయంగా ప్రభాస్‌ తెలిపాడు. కానీ ఇప్పటికీ వరకు ఆ గుడ్‌ న్యూస్‌ చెప్పలేదు.తాజాగా ప్రభాస్‌ వివాహం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. 42 ఏళ్లు ఉన్న ప్రభాస్‌ ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ చెబుతున్నారు.

‘హీరో ప్రభాస్‌ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబర్‌ 2022 నుంచి అక్టోబర్‌ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో ఇది నా జ్యోతిష్యం.’ అని తెలిపారు. మరి ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు ప్రభాస్‌ వివాహం జరుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే ప్రభాస్‌ హస్తాసాముద్రికా నిపుణుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధంగా ఉంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘ప్రేరణ’గా ఆకట్టుకోనుంది.