ప్రముఖ కొరియాగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డారట. నయనతారతో ప్రేమాయణం కారణంగా భార్యకు విడాకులివ్వడం, ఆ తర్వాత నయన్‌తో బ్రేకప్ కావడంతో ఆయన చాలా కుంగిపోయారు. కొద్దిరోజుల తర్వాత తేరుకుని తన ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే పెట్టారు. అయితే తాజాగా ఆయన బంధువుల అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఆ అమ్మాయికి కూడా ప్రభుదేవా అంటే ఇష్టమని, వీరి పెళ్లికి బంధువులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా ఇంకా స్పందించలేదు. 1995 రామలత అనే మహిళను ప్రభుదేవా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
అయితే తర్వాత ప్రభుదేవా నయనతారతో ప్రేమలో పడటంతో దంపతుల మధ్య కలహాలు మొదలై చివరికి విడాకులు తీసుకున్నారు. కొద్దిరోజులకు నయనతారతో ఆయనకు బ్రేకప్ అయింది. చాలా రోజులుగా ఒంటరి జీవితం కొనసాగిస్తున్న ఆయన జీవితంలోకి మరో మహిళ రానున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే` సినిమాను తెరకెక్కిస్తున్నారు.