రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుధేవా

రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుధేవా

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లో ఆయన వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో కలిసి ప్రభుదేవా చెన్నైలో ఉంటున్నారట. ఈ విషయాన్ని ఆయనకు అత్యంత సన్నిహితమైన ఓ వ్యక్తి మీడియాతో పంచుకున్నారు. అయితే దీనిపై ప్రభుదేవా నుంచి గానీ, ఆయన కుటుంబసభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

ప్రభుదేవా గతంలో వెన్నుముక సమస్యతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆయనకు బీహార్‌కు చెందిన ఓ లేడీ డాక్టర్ ఫిజియోథెరపీ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తాజాగా బయటపడింది. అయితే ప్రభుదేవా రెండో పెళ్లిపై కొద్దిరోజుల క్రితమే పుకార్లు వినిపించాయి.

బంధువుల అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభుదేవా బంధువుల అమ్మాయిని పెళ్లాడనున్నట్లు వచ్చిన న్యూస్ ఫేక్ అని తెలుస్తోంది. దీనిపై ప్రభుదేవా ఎలా స్పందిచారో చూడాలి. మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్నప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులిచ్చేశారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమాయణం కూడా విఫలం కావడంతో అప్పటి నుంచి ఆయన సింగిల్‌గా ఉంటున్నారు.