మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం మరంత ముదురుతుంది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులు శ్రీకాంత్, జీవితలతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.
‘మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. 60మందితో పోస్టల్ బ్యాలెట్లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారు. కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’ అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.