దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్ ట్వీట్ చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.