కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన కెరీర్ లో చేసింది నాలుగు మూవీ లే అయినప్పటికీ తన విజన్ తో మాత్రం పాన్ ఇండియా ఆడియెన్స్ ను కదిలించాడు. అయితే నీల్ తెరకెక్కించిన మొదటి మూవీ “ఉగ్రం” పర్శనల్ గా తనకి చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన “సలార్” తో మాత్రం అది రీచ్ అవుతుంది అని బలంగా నమ్మాడు.
అయితే ఉగ్రం కే కొన్ని మార్పులు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసిన సలార్ సీన్ కట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక మూవీ కి రీచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తుంది. దీనితో తనకి ఎంతో ఇష్టమైన కథ ఇంతమందికి రీచ్ అవ్వడం వారికి ఎంతో నచ్చడం అనేది మాత్రం ప్రశాంత్ నీల్ ఒక్కడే ఎంజాయ్ చేయగలిగే గొప్ప అనుభూతి అని చెప్పాలి. దీనితో ఈ మూవీ విషయంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇప్పుడు ఒక్క ప్రశాంత్ నీల్ మాత్రమే అని చెప్పాలి.