పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్య సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా తాను తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని తన రాజీనామా లేఖలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
‘‘ప్రజా జీవితంలో నేను చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్నందున తాత్కాలిక విరామం తీసుకోవాలనే నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరించలేకపోయాను.. భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’అని పీకే సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం సాగుతున్న వేళ.. ఆయన పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నవజోత్ సింగ్ సిద్ధూతో విబేధాలతో సతమతమైన అమరీందర్‌కు.. తాజాగాప్రశాంత్ కిశోర్ నిర్ణయం ఇబ్బంది కలిగించేదే. ఈ ఏడాది మార్చిలోనే పీకేను తన ప్రధాన సలహదారుగా అమరీందర్ నియమించారు.
అయితే, ఆయన మాత్రం బాధ్యతలు చేపట్టలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను ఎన్నికల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటానని పీకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2024 సాధారణ ఎన్నికలపైనే ప్రశాంత్ కిశోర్ దృష్టిసారించినట్టు సంకేతాలిచ్చారు.
బెంగాల్‌లో బీజేపీపై మమతా బెనర్జీ ఘన విజయం తర్వాత ఢిల్లీలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గత నెలలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.