Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు తాజాగా రాజశేఖర్‌తో తెరకెక్కించిన ‘గరుడవేగ’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత రాజశేఖర్‌కు ఆ చిత్రం సక్సెస్‌ను తెచ్చి పెట్టింది. దాంతో ప్రవీణ్ సత్తారు పేరు మారుమ్రోగిపోతుంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని కూడా అంతే విభిన్నంగా తెరకెక్కించాడు. అందుకే మంచి సినిమాగా పేరు సంపాదించింది. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా స్రవంతి రవికిషోర్ ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అంతా ఓకే షూటింగ్‌కు వెళ్తున్నారు అని భావిస్తున్న సమయంలో సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.
‘గరుడవేగ’ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు పది కోట్ల లోపు బడ్జెట్‌తో పూర్తి చేస్తాను అంటూ నిర్మాతలకు మొదట చెప్పి ఆ తర్వాత ఏకంగా 35 కోట్ల వరకు బడ్జెట్‌ను పెంచాడు. సినిమా సక్సెస్ అయ్యింది కనుక పర్వాలేదు, అదే సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే నిర్మాతకు దారుణమైన పరిస్థితి ఏర్పడేది. సినిమా విడుదలైనప్పటి నుండి మంచి వసూళ్లు రాబట్టి పెట్టిన బడ్జెట్‌ను రికవరీ చేయగలిగింది. ఇక రామ్‌తో చేయబోతున్న సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో చేయాలని ప్రవీణ్ సత్తారు భావిస్తున్నాడు. కాని అది స్రవంతి రవికిషోర్‌కు ఇష్టం లేదు. పది కోట్లకు కాస్త అటు ఇటుగా తప్ప మరింత బడ్జెట్ వద్దే వద్దు అంటూ దర్శకుడికి చెప్పాడు. దాంతో చేసేది లేక సినిమాను ఆపేసినట్లుగా సమాచారం అందుతుంది. దర్శకుడు తాను అనుకున్నట్లుగా చేయాలని భావిస్తుంటే, నిర్మాత మాత్రం తాను అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా క్యాన్సిల్ అయ్యేట్లుందని సినీ వర్గాల వారు అంటున్నారు.