గర్భిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. క్రిష్ణగిరి జిల్లా సింగారపేట సమీపంలోని నాయకనూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి(21)కి సేలంకు చెందిన రాంకీ(26)తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది.
ప్రస్తుతం రాజేశ్వరి రెండు నెలల గర్భిణి. మంగళవారం రాత్రి రాజేశ్వరి తన గదిలో ఉరివేసుకుంది. రాంకీ కేకలు వేయగా రాజేశ్వరి తల్లితండ్రులు వచ్చారు. అప్పటికే రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది. సింగారపేట పోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కలెక్టర్ కేసు దర్యాప్తు చేపట్టారు.