మిలియన్ వ్యూస్ ని సంపాదించిన “ప్రేమ పిపాసి”

మిలియన్ వ్యూస్ ని సంపాదించిన

జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్‌ ఫర్‌ ట్రూ లవ్‌’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌పై రాహుల్‌ బాయ్‌ మీడియా అండ్‌ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పి.ఎస్‌.రామకృష్ణ నిర్మించారు.

ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని సీనియర్‌ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్‌ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్‌ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్‌.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్‌ పండిట్, జియస్‌ రావ్, వై. వెంకటలక్ష్మి.తొలి చిత్రం ఐనప్పటికీ హీరో చాలా బాగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్ RX100 ని తలపించింది. హీరోయిన్ కోసం హీరో పడే కష్టాలు మనకి కనిపిస్తుంది.ఈ సినిమా ట్రైలర్ కొద్ది సమయంలోనే మిలియన్ వ్యూస్ ని సంపాదించి పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గలేదు.