జనవరి 24 న రానున్న“డిస్కో రాజా”

జనవరి 24 న రానున్న“డిస్కో రాజా”

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటించిన “డిస్కో రాజా” చిత్రంతో అయినా మంచి విజయం అందుకావాలని ఒక్క తన అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నభ నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా అద్భుతమైన చిత్రాల దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే అసలు ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకుల్లో ఇమిడి ఉంది?ఎవరైనా ఈ సినిమా కోసం చర్చించుకుంటున్నారా అంటే దానికి సరైన సమాధానం దొరకడం కాస్త కష్టమే అని చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ కానీ ఇతర అంశాలు కానీ జనాల్లోకి అంతగా వెళ్తున్నట్టు అనిపించడం లేదు.పైగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఇంకా సంక్రాంతి సినిమాల మోజును లోనే న్నారు.

“అల వైకుంఠపురములో” మరియు “సరిలేరు నీకెవ్వరు” ఈ రెండు చిత్రాలను ఒకదాన్ని మించి ఒకదానికి జనాలు వెళ్తున్నారు.దీనితో అసలు “డిస్కో రాజా” చిత్రానికి అంత స్కోప్ ఎక్కడా కనిపించడంలేదు.అలాగే ఇటీవలే వీరు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.ఎందుకంటే అదే రోజున “అల వైకుంఠపురములో” సక్సెస్ మీట్ కూడా ఉండడంతో సినీ వీక్షకులు కూడా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో “డిస్కో రాజా” పై ఫోకస్ అంతగా పడలేదని చెప్పాలి.మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే జనవరి 24 వరకు ఆగక తప్పదు