పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలిసిన రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు నిన్న ప్రభుత్వం ముందడుగు వేయడంతోనే వైసీపీ నాశనం మొదలయ్యిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అయితే మీకు నేను మాట ఇస్తున్నా మీ కోసం జనసేన అండగా ఉంటుంది అమరావతినే ఏపీ రాజధానిగా ఉంటుందని అన్నారు. అంతేకాదు రేపు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని తెలియచేస్తానని వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుందని రైతులకు మాటిచ్చారు. రైతులను, మహిళలను ఏడిపించిన వారు సర్వ నాశనం అయిపోతారని కూల్చివేతలతో ప్రభుత్వాన్ని మొదలెట్టిన వారు త్వరలోనే కూలిపోవడం ఖాయమని అన్నారు. వైసీపీ ఎమ్మ్మెల్యేలు ఎన్ని తిట్టినా భరిస్తానని అన్నవారి నోటి నుంచే అవన్ని కక్కిస్తానని అన్నారు. జగన్ 30 రాజధానులు పెట్టుకున్నా ఏపీకి రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే అని చెప్పుకొచ్చారు.