తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి?

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన వైఫల్యాన్ని చవి చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటా అని ప్రతీ ఒక్కరూ సందేహ పడ్డారు.దీనిని దృష్టిలో పెట్టుకొనే ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలే బయటకు వెళ్లిపోవడం మొదలు పెట్టారు.ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం నుంచే టీడీపీ నేతలు అంతా బీజేపీ పార్టీలో చేరిపోవడం షురూ చేసారు.అప్పటి నుంచి ఆ పార్టీలో మొదలయిన వలసలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నాయి.అలాగే ఒక్క బీజేపీ పార్టీలోకి మాత్రమే కాకుండా వైసీపీ పార్టీలోకి కూడ పలువురు నేతలు చేరారు.

ఇవే బాబుకు పెద్ద తలనొప్పి అనుకుంటే ఇప్పుడు అదే పార్టీకు చెందిన మరో కీలక నేత టీడీపీ నుంచి మెల్లగా జారుకోవాలని చూస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది.దీనితో అసలు డొక్కా పార్టీ మారే యోచనలో ఉన్నారని అందుకే ఇలా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని వార్తలు మొదలు పెట్టేసారు.అంతే కాకుండ తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపి లో చేరుతారని కూడా వార్తలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి.ఒక వేళ ఇదే నిజం అయితే టీడీపీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడం ఖాయం అని చెప్పాలి.