విల‌న్‌గా నటించ‌బోతున్న నాని

విల‌న్‌గా నటించ‌బోతున్న నాని

నేచ‌ర‌ల్ స్టార్ నాని ఇన్ని రోజులు మంచి పాత్ర‌లు న‌టిస్తూ వ‌చ్చారు. హీరోగా న‌టిస్తున్న నాని స‌డెన్‌గా ప్రేక్ష‌కుల‌కు ఒక షాక్ ఇవ్వ‌నున్నారు. అది ఏమిటా… అనుకుంటున్నారా. నాని విల‌న్‌గా నటించ‌బోతున్నాడు. నాని ఏంటి విల‌న్ ఏంటి అనుకుంటున్నారా? వీ మూవీలో నాని, సుధీర్‌బాబు ఇద్ద‌రు న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చి25న ఉగాధి పండ‌గ‌కు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్‌, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

27న ర‌క్ష‌కుడు వ‌స్తున్నాడంటూ సుధీర్‌బాబు సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేయ‌గా… త‌ర్వాత వ‌చ్చేది రాక్ష‌సుడేక‌దా అని నాని అంద‌రూ ఒక చిన్న క‌న్ఫ‌ర్‌మేష‌న్‌కి వ‌చ్చారు. దీంతో నాని రాక్ష‌సుడు అని అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఈ ట్వీట్‌ను చూసి క‌న్ఫ‌ర‌మ్ అవుతున్నారు. ఇక ఈ చిత్ర క‌థాంశం కృష్ణుడు గీత‌లో చెప్పిన‌ట్లు రాక్ష‌సుడి ప‌వ‌ర్ పెరిగిన‌ప్పుడు చంప‌డానికి ర‌క్ష‌కుడు వ‌స్తాడ‌న్న క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. 27న ర‌క్ష‌కుడు లుక్ రానుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో నివేదాథామ‌స్‌, అదితిరావ్ హైద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిన్న‌టి నుంచి ప్రారంభ‌మ‌యింది. ఈ చిత్రం మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా అల‌రిస్తుంద‌ని ఇంద్ర‌గంటి త‌న ట్విట‌ర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు. అలాగే హీరో నాని కూడా త‌న‌కు తిరిగి ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌న మొద‌టి సినిమా డైరెక్ట‌ర్ తో క‌లిసి చేయ‌డం చాలా ఆనందంగా ఉన్న‌ట్లు ట్విట‌ర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం నాని 25వ చిత్రం కావడం చాలా ప్ర‌త్యేకం. ఈ చిత్రం కోసం సుధీర్‌బాబు త‌న పంచింగ్ బ్యాగ్‌కు కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు చిన్న వీడియోని కూడా గ‌త వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఇంద్ర‌గంటి ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన చిత్రాల‌న్నీ హిట్ బాట ప‌ట్టిన‌వే దాదాపుగా అన్ని చిత్రాలు హిట్ అయిన‌వే. ఇంద్ర‌గంటి సినిమాల్లో ఒక ర‌క‌మైన కామెడీ ప్ల‌స్ ఫ్యామిటీ ఎమోష‌న్స్ బాండింగ్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇక మ‌రి ఈ చిత్రం ఎంత వ‌ర‌కు హిట్ అవుతుందో చూడాలి మ‌రి. నాని చేయ‌బోయే మొద‌టి ప్ర‌య‌త్నం ఎలా ఉంటుంది ప్రేక్ష‌కులు నానిని నెగిటివ్ రోల్ లో ఆద‌రిస్తారా లేదా అన్న‌ది చూడాలి.