సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకించి గుజరాత్ లో అన్ని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని అహ్మదాబాద్ జిల్లా విద్యా సంస్థ.. తమ ఆధ్వర్యంలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని స్కూళ్లకు ఓ సర్య్కూలర్ జారీ చేసింది.
ఏదో ఒక సామాజిక అంశంపై.. దేశ ప్రధానుల పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకించి జరుపుకోవడం సర్వ సాధారణం. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును కూడా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నారు. విద్యకు సంబంధించి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించినట్టు అహ్మదాబాద్ జిల్లా విద్యాధికారి (రూరల్) రాకేశ్ ఆర్. వ్యాస్ తెలిపారు.
ఈ క్రమంలో మోదీని పుట్టినరోజును పురస్కరించుకొని దేశ ప్రజలు, కార్యకర్తలకు ప్రత్యేక కానుక అందించింది బీజేపీ. నరేంద్ర మోదీ యాప్‌ను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసి.. కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేశారు. ‘బెటర్, ఫాస్టర్, స్లీకర్’ ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్‌ని ఆవిష్కరించారు.