ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రానికి చేరుకోనున్న మోదీ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటిస్తారు. మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది.
మోదీ మహబూబ్‌నగర్ పర్యటన షెడ్యూల్
రేపు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరతారు.
మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు.
పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 2:15 నుంచి 2:50 వరకు చేస్తారు.
బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారాం పూరిస్తారు.
అనంతరం తిరిగి దిల్లీకి పయవమవుతారు. సాయంత్రం 4.45 గంటలకు దిల్లీకి వెళ్తారు.
మోదీ నిజామాాబాద్ పర్యటన షెడ్యూల్
అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2:55కి నిజామాబాద్‌కు చేరుకుంటారు.
3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు.