తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు…!

Modi wrote a song on 'Garba'.
Modi wrote a song on 'Garba'.

ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుందన్నారు నరేంద్ర మోడీ. 1948లో నిజాం నుండి తెలంగాణను విడిపించడానికి ఒక గుజరాతీగా వల్లభాయ్ పటేల్ వచ్చాడు… ఇప్పుడు తెలంగాణను కాపాడడానికి మరో గుజరాతీ బిడ్డగా నేను వచ్చానంటూ నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు .

నిన్న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం లేదని అన్నారు. ‘తెలంగాణలో ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం. తెలంగాణ ప్రజలు నాపై నమ్మకం ఉంచాలి. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్ దోచుకున్న సొమ్మంతా పేదలకు పంచుతా. కాంగ్రెస్ వాళ్లు చెప్పే తప్పుడు మాటలు నమ్మవద్దు’ అని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మద్దుతు ఇచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ఆరోపించారు.