ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూంకుంట మున్సిపాలిటీకి చెందిన బాలిక, శామీర్‌పేటలోని శ్రీనివాస మెమోరియల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.
గత రెండు రోజులుగా ఆమె స్కూల్‌కు వెళ్లడం లేదు. దీనిపై కుటుంబసభ్యులు నిలదీయగా ఈ నెల 22న స్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే వెళ్లడం లేదని తెలిపింది. దీంతో వారు బుధవారం శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట సీఐ సుధీర్‌కుమార్ తెలిపారు.