అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. మరో యువకుడితో ప్రేమ వ్యవహరం నడుపుతోందని ఎనిమిదో తరగతి బాలికను ప్రిన్స్‌పాల్ వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన.. యువతి పాఠశాలలోని ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డిసెంబరు 24న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక పాఠశాలలోని 13 ఏళ్ల బాలిక, మరో యువకుడిని ప్రేమిస్తోందని కొంత కాలంగా ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా బాలిక పట్ల.. యువకుడి తల్లిదండ్రుల ముందే అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన బాధిత బాలిక పాఠశాల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు బాలికను అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. బాలిక చికిత్స తీసుకుంటూ.. డిసెంబరు 26న ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు ప్రిన్స్‌పల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్స్‌పల్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు.